Hyderabad, ఫిబ్రవరి 11 -- Malayalam Movie on Youtube: ఈ మధ్యే ప్రతి మూవీ థియేటర్ నుంచి ఓటీటీలోకి వచ్చిన తర్వాతే టీవీ, యూట్యూబ్ లలోకి వెళ్తోంది. కానీ మలయాళం మూవీ పరాక్రమం మాత్రం గతేడాది నవంబర్ లో థియేటర్లలో రిలీజై.. ఓటీటీలోకి అడుగుపెట్టకుండానే యూట్యూబ్ లోకి ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఐఎండీబీలో 7.5 రేటింగ్ ఉన్న ఈ సినిమా ఏ యూట్యూబ్ ఛానెల్లో స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

పరాక్రమం అనే మలయాళం మూవీ గతేడాది నవంబర్ 22న థియేటర్లలో రిలీజైంది. అయితే అక్కడ ఈ డ్రామాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సుమారు మూడు నెలల తర్వాత సడెన్ గా యూట్యూబ్ లో ప్రత్యక్షమైంది.

దేవ్ మోహన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను సినిమా విల్లా (Cinema Villa) అనే యూట్యూబ్ ఛానెల్ స్ట్రీమింగ్ చేస్తోంది. కేవలం ఒక గంట 35 నిమిషాల నిడివితోనే ఈ సినిమా యూట్యూబ్ లోకి రావడం విశేషం.

పర...