Hyderabad, జనవరి 2 -- Malayalam Movie: మలయాళంలోనే కాదు.. ఇండియాలోనే మోస్ట్ వయోలెంట్ సినిమాల్లో ఒకటిగా చెబుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో. ఈ సినిమా ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయింది. తెలుగు వెర్షన్ బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ డే సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ డబ్బింగ్ సినిమా తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం విశేషం. ఉన్ని ముకుందన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా.. మన దగ్గర అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది.

మార్కో మూవీ తొలి రోజే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.1.75 కోట్లు వసూలు చేయడం విశేషం. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీ ఇదే అంటూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వరకు పెద్దగా సినిమాలేవీ లేకపోవడంతో ఈ మా...