భారతదేశం, ఏప్రిల్ 11 -- దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌ల‌యాళం హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ నాన్ తెలుగులోకి వ‌చ్చింది. నేను అనే టైటిల్‌తో రిలీజైన ఈ మూవీ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. నాన్ మూవీలో దుల్క‌ర్ స‌ల్మాన్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించాడు. 2014లో మ‌ల‌యాళం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీకి రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో దుల్క‌ర్ స‌ల్మాన్‌కు జోడీగా అనుమోల్‌, శృతి రామ‌చంద్ర‌న్ హీరోయిన్లుగా క‌నిపించారు. మ‌ల‌యాళం పాపుల‌ర్ అయిన కేటీఆన్ కొత్తూర్ ఎళుతం జీవితం అనే బుక్‌ ఆధారంగా నేను మూవీని ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించాడు.

నేను మూవీ రెండు కేర‌ళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల‌ను అందుకున్న‌ది. బెస్ట్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విభాగాల్లో ఈ మూవీకి పుర‌స్కారాలు ద‌క్కాయి. ఈ మూవీలో కేటీఎన్ కొత్తూర్ అనే ఫ్రీడ‌మ్ ఫైట‌ర్‌గా, ర‌వి చంద్...