భారతదేశం, ఏప్రిల్ 16 -- Horror Movie: మ‌ల‌యాళం అడ్వెంచ‌ర్ హార‌ర్ మూవీ సైమ‌న్ డేనియ‌ల్ తెలుగులోకి వ‌చ్చింది. యూట్యూబ్‌లో ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మ‌ల‌యాళం మూవీలో వినీత్‌కుమార్, దివ్య పిళ్లై హీరోహీరోయిన్లుగా న‌టించారు. స‌జ‌న్ ఆంటోనీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2022లో మ‌ల‌యాళంతో పాటు త‌మిళంలో ఒకేసారి థియేట‌ర్ల‌లో ఈ మూవీ రిలీజైంది. ఈ మూవీ కాన్సెప్ట్‌తో పాటు కొన్ని ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి. స్క్రీన్‌ప్లేతో పాటు హార‌ర్ ఎలిమెంట్స్ రొటీన్ కావ‌డంతో సైమ‌న్ డేనియ‌ల్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. తెలుగు వెర్ష‌న్ మాత్రం డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే రిలీజైంది.

సైమ‌న్ డేనియ‌ల్ ఓ ఆర్కియాల‌జిస్ట్‌. అన్నామ‌లై ఏరియాలోని 1940కి చెందిన బ్రిటీష‌ర్ల కాలం నాటి బంగ‌ళాలో బంగ‌ళాలో నిధి ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంటుంది. ఆ నిధి కోసం వ...