భారతదేశం, మార్చి 21 -- Malayalam Movie: మ‌ల‌యాళం హారర్ థ్రిల్ల‌ర్ మూవీ స్టార్ తెలుగులోకి అదే పేరుతో డ‌బ్ అయ్యింది. నేరుగా ఈ మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. స్టార్ మూవీలో జోజుజార్జ్‌, షీలు అబ్ర‌హం హీరోహీరోయిన్లుగా న‌టించారు. స‌లార్ ఫేమ్ ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

హార‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన స్టార్ మూవీకి డొమిన్ డిసిల్వా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ఎం జ‌య‌చంద్ర‌న్ మ్యూజిక్ అందించాడు. 2021లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

అరుద్ర స్కూల్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. రాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. రామ్ త‌మ మ‌తం వాడు కాక‌పోవ‌డంతో ఆరుద్ర‌ను ఆమె ఫ్యామిలీ దూరం పెడుతుంది. రాయ్ ఎప్పుడు బిజినెస్ వ్య‌వ‌హారాల‌తో బిజీగా ఉంటాడు. అనుకోకుండా ఆర...