Hyderabad, ఏప్రిల్ 22 -- Malayalam Movie: మనసుకు హత్తుకునే ఓ మలయాళం మూవీ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. తమ పిల్లలు తమను కాదనుకోవడంతో వృద్ధాశ్రమంలోని ఓ వృద్ధ జంట ఆ వయసులో ఒకరి కోసం మరొకరు కలిసి ఉండాలని తీసుకునే నిర్ణయం వాళ్ల జీవితాలను ఎలా మార్చేస్తుందనే కథ ఆధారంగా రూపొందిన మూవీ ఇది. ఈ సినిమా పేరు ప్రణయం 1947. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ ఈ మూవీ సొంతం.

మలయాళంలో గతేడాది మార్చిలో జననం: 1947 ప్రణయం తుదరున్ను పేరుతో ఓ మూవీ రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరళలోని వృద్ధులు వయసు మీద పడిన సమయంలో ఎదుర్కొనే సవాళ్లు, కష్టాలను ఇద్దరు వృద్ధుల జీవితాల ఆధారంగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.

ఇప్పుడీ సినిమాను ప్రణయం 1947 పేరుతో ఆహా వీడియో ఓటీటీ తెలుగులోకి తీసుకొస్తోంది. ఈ సినిమా బుధవారం (ఏప్రిల్ 23) నుంచి స్ట్రీమింగ్ క...