Hyderabad, మార్చి 20 -- Malayalam Film Industry: మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలను ఇక్కడి ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. కానీ అక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ ఇండస్ట్రీ కొన్నాళ్లుగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నట్లు ది కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (కేఎఫ్‌పీఏ) వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో అయితే 17 సినిమాలు థియేటర్లలోకి రాగా కేవలం ఒకే ఒక్క మూవీ మాత్రమే హిట్ కావడం గమనార్హం.

మలయాళం సినిమా ఇండస్ట్రీలో గతేడాది పెద్ద హిట్స్ ఎన్నో ఉన్నాయి. అయినా ఇండస్ట్రీ మాత్రం నష్టాలనే ఎదుర్కొంది. ఈ ఏడాది ఈ నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. జనవరిలో రూ.110 కోట్ల నష్టం రాగా.. ఫిబ్రవరిలో మరో రూ.52 కోట్ల నష్టం వాటిల్లింది. గత నెలలో 17 సినిమాలు రిలీజ్ కాగా.. కేవలం ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ మాత్రమే హిట్ టాక్ సొంతం చేసుకుంది. లవ్‌డేల్ అనే ఓ డిజాస్ట...