Hyderabad, ఏప్రిల్ 2 -- Malayalam Comedy OTT: మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో హిట్స్ కంటే డిజాస్టర్లే ఎక్కువ. అలాంటి డిజాస్టర్ కామెడీ మూవీయే మాచంటే మాలఖ (Machante Maalakha). ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.

మంజుమ్మెల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఈ మాచంటే మాలఖ. ఈ మూవీ ఏప్రిల్ 4 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నిజానికి ప్రైమ్ వీడియో, సైనా ప్లేలలో మూవీ వస్తుందని భావించినా.. మనోరమ మ్యాక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.

కేవలం మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 27న రిలీజ్ కాగా.. ఇప్పుడు సుమారు నెలన్నర రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.

మాచంటే మాలఖ మూవీ...