Hyderabad, ఏప్రిల్ 18 -- Malayalam Actor: మలయాళం ఇండస్ట్రీ తన సినిమాలతో కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. కానీ కొన్ని రోజులుగా మాత్రం తప్పుడు కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. నటుడు షైన్ టామ్ చాకో కొచ్చి హోటల్లో జరిగిన డ్రగ్ రెయిడ్ నుంచి తప్పించుకు పారిపోయాడన్న వార్తలు ఓవైపు ఉండగా.. ఇప్పుడు మరో నటుడు శ్రీనాథ్ భాసి కూడా అవే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈసారి ఓ ప్రొడ్యూసరే ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.

మంజుమ్మెల్ బాయ్స్ మూవీ ఫేమ్ శ్రీనాథ్ భాసి తెలుసు కదా. అతడు తాజాగా నాముక్కు కొడతియిల్ కానం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను హసీబ్ మలబార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సందర్భంగా శ్రీనాథ్ తనను గంజాయి అడిగినట్లు ఆ ప్రొడ్యూసర్ చెప్పాడు. మాతృభూమితో అతడు మాట్లాడాడు. "ఒకరోజు రాత్రి అతడు నన్ను నేరుగా కాదుకానీ.. అతని కోసం నేను ...