భారతదేశం, మార్చి 5 -- మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మార్కో'పై చాలా చర్చ జరిగింది. ఇండియాలోనే వైలెంట్ మూవీ అంటూ ఇది పాపులర్ అయింది. థియేటర్లలో ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించినఈ మూవీ రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అయితే, ఈ చిత్రంలో క్రూరమైన సీన్లు, హింస విపరీతంగా ఉన్నాయని, సమాజంపై ఇవి చెడు ప్రభావాన్ని చూపిస్తాయన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తాజా మార్కో మూవీకి ఎదురుదెబ్బ పడింది.

టీవీ ఛానెళ్లలో మార్కో చిత్రాన్ని ప్రసారంపై చేయడంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‍సీ) బ్యాన్ విధించింది. శాటిలైట్ హక్కులను విక్రయించేందుకు మేకర్స్ చేసిన దరఖాస్తును తిరస్కరించింది. ఈ చిత్రంలో విపరీతమైన హింసాత్మక సన్నివేశాలు ఉన్న కారణంగా టీవీల్లో ప్రసారం చేయడాన్ని నిషేధించింది.

మార్కో చిత్రం ప్రస్తుతం మలయాళం, తెలు...