భారతదేశం, మార్చి 5 -- Malakpet Woman Incident : హైదరాబాద్ మలక్‌పేట్ వివాహిత శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీషను ఆమె భర్త సోదరి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. భార్య హత్య విషయం తెలిసినప్పటికీ బయటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని మాయం చేసేందుకు భర్త వినయ్‌ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. శిరీషకు మత్తు మందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. శిరీష్ భర్త వినయ్, అతడి సోదరిని పోలీసులు అరెస్టు చేశారు.

శిరీష గుండెపోటుతో మరణించిందని ఆమె భర్త వినయ్ నాటకం ఆడాడని పోలీసులు గుర్తించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమె గుండె పోటుతో మరణించలేదని, ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా బయటపడిందన్నారు.

హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన శిరీష తల్లిదండ్రులు ఆమె...