Hyderabad, మార్చి 14 -- ఫూల్ మఖానాను ఇప్పుడు సూపర్ ఫుడ్ గా చెప్పుకుంటున్నారు. దానితో చేసే లడ్డూలు రుచిగా ఉంటాయి. పైగా అది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. శరీరాన్ని ఉక్కులా మార్చే శక్తి మఖానా లడ్డుకి ఉంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి. దీనిలో అనేక డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా వేస్తాం. కాబట్టి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మఖానా లడ్డు రెసిపీ ఎలాగంటే...

ఫూల్ మఖానా - మూడు కప్పులు

నెయ్యి - నాలుగు స్పూన్లు

బాదం పప్పులు - అరకప్పు

జీడిపప్పులు - అర కప్పు

కొబ్బరి పొడి - ఒక కప్పు

బెల్లం - ఒకటిన్నర కప్పు

నీళ్లు - అరకప్పు

1. స్టవ్ మీద కళాయి పెట్టి పూల్ మఖానాను వేసి క్రిస్పీగా అయ్యేలా వేయించుకోవాలి.

2. అలా వేగిన మఖానాను తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అదే కళాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పులు, బ...