భారతదేశం, అక్టోబర్ 27 -- సోషల్ మీడియాలో హెన్నా మేకప్ ఒకటి హల్ చల్ అవుతోంది. అంటే హెన్నా లేదా మెహందీతో మేకప్ అన్నమాట. పెదాలకు ఎరుపు రంగు కోసం ఎరుపు రంగు నిచ్చే మెహందీ, కను బొమ్మల నలుపు రంగు కోసం హెన్నా వడటం..ఇలా రకరకాలుగా హెన్నా వాడేస్తున్నారు. దాంతో మేకప్ చాలా సులవవుతుందని చెబుతున్నారు.

ఒక్కసారి పెదాలకు గోరింటాకు పెట్టుకుంటే కనీసం వారం దాకా అయినా లిప్‌స్టిక్ వేసుకోక్కర్లేదు. అలాగే నలుపు రంగు హెన్నా ఐబ్రోలకు పెట్టుకుంటే ఐబ్రో పెన్సిల్ వాడకుండానే కనుబొమ్మలు మందంగా కనిపిస్తాయట. కను రెప్పల మీద పెట్టుకుంటే ఐషాడో కూడా అక్కర్లేదు. మరి ఈ ట్రెండ్ నిజంగా పని చేస్తుందా తెల్సుకుందాం.

వైరల్ అవుతోన్న హెన్నా మేకప్ చూస్తే ఏ హాని లేనట్లే అనిపిస్తుంది. కానీ ఈ తాత్కాలికమైన రంగు వల్ల హాని కలుగుతుందని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. గోరింటాకులో పిపిడి అనే పా...