భారతదేశం, నవంబర్ 29 -- Makeup Tips for Big Forehead : చాలామందికి నుదురు పెద్దదిగా ఉంటుంది. కొందరికి ముందు నుంచే నుదురు పెద్దదిగా ఉంటుంది. మరికొందరికి.. జుట్టు ఊడిపోతున్న సమయంలో నుదురు పెద్దది అవుతుంది. దీనినే చాలా మంది సమస్యగా భావిస్తారు. మనం ఎలా ఉన్నామో.. అలాగే ఉండడం మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. లేదు అంటే.. మనంలో అభద్రతా భావం చాలా ఎక్కువైపోతుంది.

మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటే.. ఇతరుల ఫీలింగ్స్​తో మనకు సంబంధం ఉండదు. అయినా సరే కొన్ని మేకప్ ట్రిక్​లతో.. ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు మేకప్ నిపుణులు. కొన్ని సింపుల్ చిట్కాలు మీ నుదురు చిన్నదిగా కనిపించేలా చేస్తాయని అంటున్నారు. ఆ ట్రిక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు మీ నుదురు.. చిన్నదిగా కనిపించాలనుకుంటే.. మీ హెయిర్‌లైన్‌కు ఫౌండేషన్‌ను పూయడం ఆపండి. ఇది మీ హెయిర్‌లైన్‌పై సహజమైన నీ...