భారతదేశం, అక్టోబర్ 28 -- ఈ మధ్య ఏ ఫంక్షన్ వెళ్లినా ప్రతి ఒక్కరు కాస్తో కూస్తో మేకప్ వేసుకునే కనిపిస్తున్నారు. మీకు కూడా మేకప్ వేసుకోవడం మొదలు పెట్టాలి అనిపిస్తోందా? కానీ ఎలాంటి ఉత్పత్తులు అవసరమవుతాయో తెలియట్లేదా? అయితే బేసిక్, సింపుల్ మేకప్ కోసం ఏమేం అవసరమవుతాయో వాటి ఉపయోగం ఏంటో వివరంగా తెల్సుకోండి.

మీరు ఇదివరకే ఏదైనా వాడుతుంటే దాన్నే మేకప్ కోసం కూడా వాడొచ్చు. మేకప్ కన్నా ముందు మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. మేకప్ పేలినట్లు తెల్లగా కనిపించకుండా సాయపడుతుంది.

మేకప్ ఎక్కువగా సేపు ఉండేలా చేసేది ప్రైమర్. ఫౌండేషన్ కన్నా ముందు, మాయిశ్చరైజర్ తర్వాత దీన్ని రాసుకోవాలి. చర్మం మీదున్న సన్నం రంధ్రాలు, గీతలు ఏవైనా ఉంటే వాటిని ఇది కనిపించకుండా చేస్తుంది. మీరు రోజూవారీ మేకప్ కోసం ప్రైమర్ వాడక్కర్లేదు. మేకప్ ఎక్కువసేపు చెక్కు చెదర...