భారతదేశం, డిసెంబర్ 26 -- మకర సంక్రాంతి 2026: హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో మకర సంక్రాంతి (Sankranti 2026) ఒకటి. మకర సంక్రాంతి ముందు రోజున భోగి పండుగను జరుపుకుంటాము. అలాగే మకర సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటాము. సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటాము. సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ నాడు పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు.

రకరకాల పద్ధతులు, ఆచారాలను పాటిస్తూ ఉంటారు. కోడిపందాలు, గాలిపటాలను ఎగరవేయడం, భోగినాడు భోగి (Bhogi 2026) మంటలు, చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం, రంగురంగుల ముగ్గులు వేయడం.. ఇలా సంక్రాంతి గురించి చెప్పుకుంటే చాలా ఉంది. హిందూ మతంలో ఇలాంటి ఉపవాసాలు, పండుగలు చాలా ఉన్నాయి. అయితే హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగల్లో సంక్రాంతి కూడా ఒకటి. ఇది ప్రతి ఏటా పుష్య మాసంలో వస...