Hyderabad, మార్చి 17 -- మైదా వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా మైదా పిండితో చేసిన బ్రెడ్, సమోసాలు, పూరీ, కేకులు, బిస్కెట్లు తినే వారి సంఖ్య అత్యధికంగానే ఉంది. శుద్ధి చేసిన పిండి అయిన మైదాను వాడడం చాలా ప్రమాదం. ఇది జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ప్రాసెస్ చేసిన ఏ ఆహారం కూడా ఆరోగ్యకరం కాదు.

మైదా చాలా మృదువుగా తెల్లగా రావడానికి దీనిలో ఎన్నో రకాల రసాయనాలు కలుపుతారు. మైదా తెలుపు రంగు కోసం ఇందులో బెంజాయిల్ పెరాక్సైడ్ రసాయనం కలుపుతారు. ఇక సున్నితంగా ఉండేందుకు అలోక్సాన్ వంటి రసాయనం మిక్స్ చేస్తారు. ఈ రెండింటినీ బ్లీచింగ్ ప్రక్రియలో వాడతారు. దీన్ని బట్టి మైదా ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు.

అయితే భారతీయ ఆహారంలో మైదా పాత్ర ఎక్కువ. వీటితో చేసే పూరీలు, సమోసాలు, కజ్జికాయలు, కేకులు, బ్రెడ్డులు, బిస్క...