భారతదేశం, మే 4 -- Mahindra XUV700 Blaze Edition price : మహీంద్రా తమ పాప్యులర్ ఎస్​యూవీ.. మహీంద్రా ఎక్స్​యూవీ700లో కొత్త, స్పెషల్ ఎడిషన్​ను లాంచ్ చేసింది. బ్లేజ్ ఎడిషన్​గా పిలిచే దీని ఎక్స్​షోరూమ్ ధర రూ.24.24 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్లేజ్ ఎడిషన్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ పవర్ట్రెయిన్, 7-సీటర్ కాన్ఫిగరేషన్లతో మాత్రమే లభిస్తుంది. పెట్రోల్ ఏటీ, డీజిల్ ఏటీ, ఎంటీ ఆప్షన్స్​లో అందుబాటులో ఉంటుంది. 2024 మహీంద్రా ఎక్స్​యూవీ700 బ్లేజ్ ఎడిషన్ కాస్మొటిక్ మార్పులతో మాత్రమే వస్తుంది. మహీంద్రా ఎస్​యూవీలో ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు.

మహీంద్రా ఎక్స్​యూవీ700 బ్లేజ్ ఎడిషన్ కొత్త మ్యాట్ బ్లేజ్ రెడ్ కలర్​లో నపోలీ బ్లాక్ హైలెట్స్​తో రూపుదిద్దుకుంది. కాబట్టి.. రూఫ్​, రేర్​ వ్యూ అద్దాలు, గ్రిల్, అల్లాయ్ వీల్స్ నల్లగా ఉంటాయి. ఇంటీరియర్​లో కూడా కొన్ని కాస్మొట...