భారతదేశం, ఫిబ్రవరి 22 -- దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో దిగ్గజ కంపెనీలు ఈ మార్కెట్‌పై కన్నేశాయి. కొత్త ఈవీలను తీసుకొస్తున్నాయి. ఇక మహీంద్రా విషయానికొస్తే.. ముఖ్యంగా తన పోర్ట్ ఫోలియోలో బీఈ 6, ఎక్స్‌ఈవీ9ఈలను ప్రవేశపెట్టింది. ఈ చర్య దాని అమ్మకాలు, మార్కెట్ వాటా పెరిగేందుకు సాయపడ్డాయి. రాబోయే రోజుల్లో కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో కొన్ని కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను జోడించబోతోంది. మోడల్ ఎక్స్ఈవీ 7ఈ కూడా ఇందులో ఉంది. ఇది 2 బ్యాటరీ ఆప్షన్లలో అందించబడుతుందని భావిస్తున్నారు. గరిష్ట పరిధి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇటీవల లీకైన సమాచారం ఎక్స్ఈవీ 7ఈ ఆవిష్కరణపై ఊహాగానాలు ఎక్కువే ఉన్నాయి. మహీంద్రా ప్రస్తుతం బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కోసం ఉన్న డిమాండ్ తీర్చడంపై దృష్టి సారించింది. ఇప్పుడు ఎక్స్ఈవీ 7ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2025 మధ్యలో ల...