భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఆటోమెుబైల్ పరిశ్రమలో జనవరి సేల్స్ రిపోర్టులు సందడి చేస్తున్నాయి. కొన్ని కార్లు అమ్మకాల్లో దూసుకెళ్తుంటే.. మరికొన్ని తోపు కార్లు ఈసారి విక్రయాలు తగ్గి వెనక్కు వెళ్లాయి. గత కొన్ని నెలలుగా ఎర్టిగా కంటే వెనుకబడిన మహీంద్రా స్కార్పియో ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 10 కార్ల జాబితాలో స్కార్పియో ఏడో స్థానంలో ఉంది. గత నెలలో 15,442 స్కార్పియో కార్లు అమ్ముడయ్యాయి. ఈ విధంగా, స్కార్పియో తన విభాగంలో ఈ సంవత్సరం గొప్ప ప్రారంభాన్ని చూసింది. టాప్ 10 జాబితాలో మహీంద్రాకు చెందిన ఏకైక కారు స్కార్పియో.

స్కార్పియో ఎన్‌లో ‌ కంపెనీ సరికొత్త సింగిల్ గ్రిల్‌ను ఇచ్చింది. ఇది క్రోమ్ ఫినిషింగ్‌ను చూపిస్తుంది. గ్రిల్‌పై కంపెనీ కొత్త లోగో కనిపిస్తుంది. ఇది దాని ముందు భాగం అందాన్ని పెంచుతుంది. రీడిజైన్ చేసిన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప...