భారతదేశం, ఏప్రిల్ 2 -- భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులలో ఒకటైన మహీంద్రా మార్చి 2025లో మొత్తం వాహన అమ్మకాల (ప్రయాణికుల, వాణిజ్య, విద్యుత్ వాహనాలతో సహా) గణాంకాలను వెల్లడించింది. ఎగుమతులతో సహా మొత్తం 83,894 వాహనాలు అమ్ముడయ్యాయని, ఇది 23 శాతం పెరుగుదల అని ప్రకటించింది. యుటిలిటీ వెహికల్స్ విభాగంలో మహీంద్రా దేశీయ మార్కెట్లో 48,048 వాహనాలను విక్రయించింది. ఇది 18శాతం వృద్ధి. ఎగుమతులతో సహా మొత్తం 50,835 వాహనాలు అమ్ముడయ్యాయి. దేశీయ వాణిజ్య వాహనాల అమ్మకాలు 23,951గా ఉన్నాయి.

కంపెనీ ఈ సంవత్సరాన్ని 5,51,487 ఎస్‌యూవీలతో ముగించింది. ఇది కంపెనీ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అత్యధికం. ఈ ఆర్థిక సంవత్సరం 20 శాతం వృద్ధితో (ఏప్రిల్ 1, 2024 నుండి మార్చి 31, 2025 వరకు) అత్యధిక వాహన రిజిస్ట్రేషన్లతో ముగిసిందని కంపెనీ తెలిపింది.

'మార్చిలో మేం మొత్తం 48,048...