భారతదేశం, ఫిబ్రవరి 6 -- మహీంద్రా తన థార్ XUV700, స్కార్పియో ఎన్, ఇతర మోడళ్ల వంటి కార్లపై డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ప్రయోజనాలు ఫిబ్రవరి 2025 నెలకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ఇది MY(Model Year)2024, MY2025 స్టాక్‌లపై వర్తిస్తుంది. మహీంద్రా ఈ నెలలో బొలెరో అన్ని మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది.

ఆఫ్-రోడ్ సెంట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా థార్ MY2024 స్టాక్‌పై ఆఫర్‌లను అందిస్తుంది. థార్ 4WD వేరియంట్ పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లపై రూ. లక్ష వరకు తగ్గింపు లభిస్తుంది. మరోవైపు థార్ 2WD డీజిల్ వేరియంట్‌లపై రూ. 50,000 వరకు ఆఫర్ వస్తుంది. 2WD పెట్రోల్ వేరియంట్‌లపై రూ. 1.25 లక్షల వరకు అత్యధిక తగ్గింపు దొరుకుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700పై MY2024 స్టాక్ పై రూ.1 లక్ష వరకు తగ్గింపు లభిస్తుంది. టాప్ ఏఎక్స్7 వేరియంట్‌లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు ఉంటుంద...