భారతదేశం, మార్చి 21 -- సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త యాడ్ రిలీజైంది. ట్రెండ్స్ యాడ్ లో ఆయన తన కూతురు సితారాతో కలిసి యాక్ట్ చేయడం విశేషం. ఈ తండ్రీకూతురు కలిసి నటించిన కొత్త యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీళ్లు ఫాదర్, డాటర్ లా లేరని.. అన్నాచెల్లెలిలా కనిపిస్తున్నారంటూ మహేష్ లుక్ పై ఫ్యాన్స్ కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ యాడ్ లో మహేష్ కు సితారా జెన్ జెడ్ లాంగ్వేజ్ ను నేర్పిస్తూ కనిపించింది.

మహేష్ బాబు, సితారా కలిసి చేసిన కొత్త యాడ్ అదుర్స్ అనిపిస్తోంది. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ సితారా కూడా యాక్టింగ్ తో మెప్పిస్తోంది. ఇప్పటికే ఆమె ఓ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రి తో కలిసి ట్రెండీగా ట్రెండ్స్ యాడ్ లో తళుక్కుమంది. ఈ వీడియోను మహేష్, అతని భార్య నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు.

ఈ బట్టల ...