భారతదేశం, ఏప్రిల్ 5 -- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన డాటర్ సితారాతో కలిసి వెకేషన్ కు వెళ్లారు. శనివారం (ఏప్రిల్ 5) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వీళ్లు కనిపించారు. అయితే ఫ్యామిలీతో కలిసి మహేష్ తరచూ వెకేషన్ కు విదేశాలకు వెళ్లడం తెలిసిందే. కానీ ఈ సారి ఆయన పాస్‌పోర్ట్‌తో కనిపించడ మాత్రం వైరల్ గా మారింది. దీని వెనుక ఓ రీజన్ ఉంది. టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌలి కనెక్షన్ ఉంది.

రాజమౌలి డైరెక్టర్ గా, మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 (వర్కింగ్ టైటిల్) మూవీ షూటింగ్ నుంచి సూపర్ స్టార్ బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కూతురు సితారాతో కలిసి ఫారెన్ కంట్రీకి వెళ్లిపోయారు. ఎయిర్ పోర్ట్ లో ఫొటోగ్రాఫర్స్ కు పాస్‌పోర్ట్‌ చూపిస్తూ ఈ టాలీవుడ్ ప్రిన్స్ నవ్వులు చిందించారు.

ఓ ఫొటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా...