భారతదేశం, ఫిబ్రవరి 26 -- మ‌హేష్‌బాబు కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌లో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ఒక‌టి. వెంక‌టేష్‌, మ‌హేష్‌బాబు హీరోలుగా న‌టించిన ఈ మూవీ 2013లోనే యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నంది, ఫిల్మ్‌పేర్‌తో పాటు అనేక అవార్డుల‌ను గెలుచుకుంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దిల్‌రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మూవీలో స‌మంత‌, అంజ‌లి హీరోయిన్లుగా న‌టించారు. ఈ మూవీలో మ‌హేష్‌బాబు, వెంక‌టేష్‌ల‌కు తండ్రి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించారు. అయితే ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌ కోసం తొలుత ర‌జ‌నీకాంత్‌ను తీసుకోవాల‌ని భావించార‌ట ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల‌. ర‌జ‌నీకాంత్‌కు క‌థ కూడా వినిపించార‌ట‌.

మ‌హేష్‌బాబు, వెంక‌టేష్‌ల‌కు ఫాద‌ర్‌గా ర‌...