భారతదేశం, ఏప్రిల్ 22 -- టాలీవుడ్ అగ్ర హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇబ్బందుల్లో పడ్డారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్న ఆయనకు ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సుహానా గ్రూప్‍‌లపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. దీంతో ఆ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్న మహేశ్ బాబుకు నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఆదేశించింది.

సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్న మహేశ్ బాబును ఏప్రిల్ 27న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కావాల్సిన సమాచారం ఇచ్చేందుకు రావాలని సూచించింది. ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్నందుకు సాయి సూర్య డెవపర్స్ నుంచి మహేశ్ బాబు రూ.5.9కోట్లు అందుకున్నారని ఈడీ పేర్కొంది. ఇందులో రూ.3.4కోట్లను చ...