Hyderabad, ఏప్రిల్ 9 -- జైన మతానికి చెందిన ఇరవై నాలుగవ తీర్థంకరుడు మహావీరుడు. అతను చిన్న వయసులోనే సన్యాసం తీసుకున్నాడు. కరుణ అనే కొత్త మతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా మహావీరుడు పేరుగాంచాడు. అతని పుట్టిన రోజునే మహావీర్ జయంతిగా ఇప్పటికీ పండుగా నిర్వహించుకుంటారు జైనులు. రేపే మహావీర్ జయంతి.

మహావీరుడిని స్వామీజీగా చెప్పుకుంటారు. ఈయన అహింస, ప్రేమ గురించి జనులకు బోధించేవారు. నిత్యం తపస్సులో ఉండేవారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న మహావీర్ జయంతిని నిర్వహించుకోబోతున్నాం.

మహావీర్ స్వామి క్రీ.పూ 599లో బీహార్ లోని లిచ్చావి వంశానికి చెందిన మహారాజు సిద్ధార్థ, రాణి త్రిశాల దంపతులకు జన్మించారని చరిత్ర పుటల్లో ఉంది. చిన్నతనంలో మహావీరుడి పేరు వర్ధమాన్. మహావీరుడు ఆనందం, శాంతికి ఐదు సూత్రాలను అందించాడు. సత్యం, ఉనికి, బ్రహ్మచర్యం, భౌతికేతర విషయాలకు దూరంగా ఉ...