భారతదేశం, జనవరి 29 -- ప్రయాగ్‌రాజ్ మహకుంభ మేళాలో అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి సుమారు 15 మంది మృతి చెందినట్టుగా సమాచారం. 40 మంది వరకు గాయపడినట్లుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని ఘటన స్థలంలో ఓ వైద్యుడు చెప్పినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ సంఘటనతో మొత్తం 13 అఖాఢాలు బుధవారం అమృత్ స్నాన్‌ను రద్దు చేశాయి.

అఖారా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని స్నానాలు రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని, బసంత్ పంచమి నాడు స్నానాలు ఉంటాయని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. సంఘటన స్థలంలో అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టడం గురించి చర్చించారు.

అర్థరాత్రి బారికేడ్లు విరిగిపడడంతో తొక్కిసలాట జరిగ...