భారతదేశం, జనవరి 30 -- బుధవారం తెల్లవారుజామున మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించారు. 60 మంది గాయపడ్డారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఇన్ జనరల్ వైభవ్ కృష్ణ ప్రయాగ్‌రాజ్‌లో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. మృతుల్లో 25 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 36 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మిగిలిన వారిని వారి కుటుంబాలతో పంపించారు.

భక్తుల తోపులాట కారణంగా ఈ సంఘటన అర్ధరాత్రి 1 గంటల నుంచి 2 గంటల మధ్య జరిగింది. జనం బారికేడ్లను దూకి అవతలి వైపునకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 90 మందికి పైగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 30 మంది మరణించారని విలేకరుల సమావేశంలో డీఐజీ చెప్పారు.

ప్రాణనష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. గణాంకాలను విడుదల చేయడానికి అధికారులు 16 గంటలకు పైగా సమయం...