భారతదేశం, జనవరి 29 -- Mahakumbh Stampede: ప్రయాగ్‌రాజ్ మహకుంభ మేళాలో అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సంఘటన తరువాత బుధవారం కొద్దిసేపు అమృత్ స్నాన్‌ కార్యక్రమాన్ని నిలిపివేశారు.

బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అమృత స్నానం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో ఈ ప్రమాదం జరిగింది. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగిపడ్డాయి. పలువురు భక్తులు కింద పడిపోయారు. మరోవైపు, చీకట్లో ఇనుప డస్ట్ బిన్ లు కనిపించపోవడంతో, అవి తగిలి కొందరు కిందపడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను మహకుంభ్‌ సెంట్రల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మౌని అమవాస్య కావడంతో పుణ్య స్నానాల కోసం...