భారతదేశం, జనవరి 29 -- ప్రయాగ్‌రాజ్ మహకుంభ మేళాలో అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి సుమారు 20 మంది మృతి చెందినట్టుగా సమాచారం. 100 మంది వరకు గాయపడినట్లుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని ఘటన స్థలంలో ఓ వైద్యుడు చెప్పినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మెుదట తక్కువ మందే మృతి చెందారని అనుకున్నారు.. కానీ తర్వాత మరణించినవారి సంఖ్య ఎక్కువే ఉందని తెలుస్తోంది. ఈ సంఘటనతో బుధవారం అమృత్ స్నాన్‌ను రద్దు చేశారు.

అర్థరాత్రి బారికేడ్లు విరిగిపడడంతో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను మహకుంభ్‌ సెంట్రల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మౌని అమవాస్య కావడంతో పుణ్య స్నానాల కోసం భారీ సంఖ్యలో భక్తులు త్రివేణి సంగం వద్దకు తరలివచ్చారు. దీంతో ఈ ఘటన జరిగింది.

అఖారా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి మా...