భారతదేశం, మార్చి 2 -- కేసీఆర్‌ పాలమూరు ద్రోహి అని.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఆర్డీఎస్‌ ప్రాజెక్ట్ ఎందుకు ఎండిపోయిందని నిలదీశారు. ఎస్ఎల్‌బీసీ పనులు చేయకపోవడం వల్లే 8 మంది ప్రాణాలు పోయాయని ఆరోపించారు. ఏడాది కాకుండానే మమ్మల్ని దిగిపోమంటున్నారన్న రేవంత్.. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

'ఎస్ఎల్‌బీసీ పాపం కల్వకుంట్ల చంద్రశేఖర రావుదే. పనులను సగంలో ఆపడం వల్లే 8 మంది కార్మికులు చనిపోయారు. రాయలసీమకు నీళ్లు తరలిపోవడానికి కారణం కేసీఆర్ కాదా? తెలంగాణ పట్ల మోదీ సానుభూతితో ఉంటే.. కిషన్ రెడ్డి మాత్రం పగతో ఉన్నారు. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడని కిషన్ రెడ్డి దుఃఖంలో ఉన్నారు. కిషన్ రెడ్డి బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రజల కోసం ఇన్ని సంక్షేమ ప...