భారతదేశం, మార్చి 10 -- Mahabubabad News : మహబూబాబాద్​ జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి వద్ద ఆడుకుంటూ ఓ బాలుడు పల్లి గింజ మింగగా.. అది కాస్త గొంతులో ఇరుక్కుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా గూడూరు మండలం నాయక్​ పల్లిలో వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాయక్​ పల్లి గ్రామానికి చెందిన గుండెల వీరన్న-కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. 18 నెలల వయసున్న గుండెల అక్షయ్ శివ ప్రేమ్​కుమార్... ఒక్కగానొక్క కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇంతవరకు బాగానే ఉండగా.. ఈ నెల 7వ తేదీన తల్లి కల్పన ఇంటి పనులు చేసుకుంటూ తన కొడుకు అక్షయ్​ శివ ప్రేమ్​ కుమార్ ను ఇంటి ఆవరణలో వదిలింది. ఈ క్రమం...