భారతదేశం, ఏప్రిల్ 4 -- Mahabubabad Murder: మహబూబాబాద్‌లో హెల్త్‌ సూపర్‌ వైజర్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి మరీ మర్డర్ చేయించినట్టు తేలింది. ఓ ఉపాధ్యాయుడితో తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే పార్థసారథిని అతడి భార్యే హత్య చేయించినట్టు పోలీసులు నిర్ధారించారు.

ఈ మేరకు ఆమెతో పాటు ఆ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేయగా.. ముగ్గురు సభ్యుల సుపారీ గ్యాంగ్ పరారీలో ఉన్నారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జగదీష్ కాలనీలో ఉండే తాటి పార్థసారథి(42)కి, అదే ప్రాంతంలో ఉండే స్వప్నకు కొన్నేళ్ల కిందట పెళ్లి జరిగింది. వారికి ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు. పార్థసారథి దంతాలపల్లి మండల కేంద్రంలోని జ్యోతిరావుపూలే గురు...