భారతదేశం, ఏప్రిల్ 1 -- ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని భజన తండా శివారులో మంగళవారం ఉదయం జరిగింది. ఏడాది కిందట కూడా ఆయనపై దాడి ప్రయత్నం జరగగా.. ఇప్పుడు ఆయన హత్యకు గురి కావడం వివిధ అనుమానాలకు తావిస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన తాటి పార్థ సారధి.. కొంతకాలంగా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలో హెల్త్ సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. మహబూబాబాద్‌లో ఉంటూ రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేవాడు. ఉగాది, రంజాన్ పండుగ నేపథ్యంలో వరుస సెలవులు కావడంతో పార్థసారధి స్వగ్రామం వెళ్లాడు. మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలు దేరాడు.

మహబూబాబాద్ సమీపంలోని భజన తండా శివారులో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు స్థానికులు మంగళవారం ఉదయం 6.30 గంటల సమయం...