తెలంగాణ,మహబూబాబాద్, మార్చి 5 -- మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తమ ఇంట్లోకి నాటు కోళ్లు వస్తున్నాయని, వాటి పెంచుకుంటున్న పక్కింటి వృద్ధుడిపై ఓ వ్యక్తి కిరాతకంగా దాడి చేశాడు. గొడ్డలితో రెండు కాళ్లపై నరకగా.. తీవ్ర గాయాలతో వృద్ధుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. రెండు రోజుల కిందట ఈ ఘటన జరగగా.. బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని సిరోల్ పోలీస్ స్టేషన్ పరిధి సూదనపల్లి గ్రామానికి చెందిన కొండ సోమయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు తన ఇంటి వద్ద నాటు కోళ్లను పెంచుకుంటున్నాడు. తన ఇంట్లో ఉన్న వడ్లు, బియ్యంతో వాటిని పెంచుతుండగా.. అవి మేత కోసం చుట్టూ తిరిగేవి. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట సోమయ్యకు చెందిన నాటు కోళ్లు మేత కోసం ఆ పక్కనే ఉన్న మ...