మేచరాజుపల్లి,తెలంగాణ, మార్చి 9 -- మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి శోక సంద్రంలో మునిగింది. గ్రామానికి చెందిన ఓ ఎల్ఐసీ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఫ్యామిలీ వరంగల్ జిల్లా తీగరాజుపల్లి వద్ద కారుతో సహా కెనాల్ లో పడిపోగా.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనకు ముందే గ్రామంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. చేపల వేట కోసం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువు కుంటలో పడి మృత్యువాత పడ్డారు. దీంతో గంటల వ్యవధిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, వారంతా నీళ్లలోనే మృతి చెందడం కలవరానికి గురి చేస్తుండగా.. వారి మరణంతో ఊరంతా కన్నీరు పెడుతోంది.

చేపల వేట కోసం చెరువులోకి దిగిన ఇద్దరు వ్యక్తులు అందులో ఉన్న గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో శుక్రవారం ...