Hyderabad, ఏప్రిల్ 4 -- వయసుతో పాటు మోకాళ్లలో గుజ్జు(Cartilage) కరగడం అనేది సహజంగా జరుగుతుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని అన్ని జాయింట్లలో గుజ్జు కరిగినప్పటికీ మోకాళి జాయింట్లు చాలా త్వరగా అరుగుతాయి. ఇందుకు కారణం శరీర బరువంతా మోకాళ్ల మీద పడటమే. గుజ్జు అరిగిపోవడం వల్ల మోకాళ్లలో తీవ్రనొప్పి, నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజుల్లో ఈ సమస్య చిన్న వయసు నుంచే ప్రారంభమవుతుంది.

మోకాళ్లలోని రెండు ఎముకల మధ్య గుజ్జులా ఉంటుంది. ఇది రెండు ఎముకల మధ్య రాపిడి జరగకుండా, నొప్పిలేకుండా నడిచేందుకు సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ గుజ్జు నెమ్మదిగా కరిగిపోతుంటుంది. ఇది కరుగుతున్న కొద్దీ ఎముకల మీద ఒత్తిడి పడి మోకాళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి. రెండు ఎముకల మధ్య ఉండే ఈ గుజ్జు పూర్తిగా కరిగిపోయిందంటే నడుస్తున్నప్పుడు, కింద కూర్చుని లేస్తున్...