భారతదేశం, ఫిబ్రవరి 11 -- గతేడాది శివరాత్రి నిర్వహణ అనుభవాల ఆధారంగా.. ఈ ఏడాది చర్యలు చేపట్టాలని.. మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. ప్రధానంగా క్యూ మేనేజ్‌మెంట్, మంచి నీటి వసతి, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్‌, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుద్దీపాల ఏర్పాటు, చలువ పందిళ్ల (తడకలతో) ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని మంత్రి స్పష్టం చేశారు. వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్‌ శాఖ సమన్వయంతో ట్రాఫిక్‌ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆయా దేవాలయాలున్న పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో స్థానిక, ఆంగ్ల భాషల్లో సూచిక బోర్డులను ఏర్పా...