భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో మహా కుంభమేళాకు వెళుతున్న ఓ కారు.. మీర్జాపూర్​- ప్రయాగ్​రాజ్​ హైవేపై ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10మంది మరణించారు. మరో 19మంది గాయపడ్డారు.

శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్​గఢ్​ నుంచి మహా కుంభమేళాకు వెళుతున్న ఓ బొలెరో కారు.. యూపీ మేజా పోలీస్​స్టేషన్​ సమీపంలో ఓ బస్సును ఢీకొట్టింది.

కుంభమేళా సందర్భంగా సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఛత్తీస్​గఢ్​లోని కోర్బా నుంచి భక్తులు ప్రయాగ్​రాజ్​కి వెళుడగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు మధ్యప్రదేశ్​లోని రాజ్​గఢ్​కు చెందిన యాత్రికులతో వెళ్తున్నట్లు సమాచారం.

ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి, మృతదేహాలను వెలికితీశా...