భారతదేశం, ఫిబ్రవరి 11 -- మహా కుంభమేళా 2025లో భాగంగా మరో కీలక ఘట్టానికి ప్రయాగ్​రాజ్​ నగరం సన్నద్ధమవుతోంది. మాఘ పౌర్ణమి నేపథ్యంలో ఫిబ్రవరి 12న కోట్లాది మంది ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ప్రయాగ్​రాజ్​ చుట్టూ ఇప్పటికే విపరీతమైన ట్రాఫిక్​ సమస్యలు తలెత్తడటంతో మాఘ పౌర్ణమి స్నానాలకు అధికారులు అదనపు చర్యలు చేపట్టారు.

గత రెండు రోజులుగా మహా కుంభమేళాకు వెళ్లే రహదారులు వాహనాలతో కిటకిటలాడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా, అనేక ప్రాంతాల్లో ప్రజలు 30 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోయారు. సరిగ్గా ఈ సమయంలోనే మాఘ పౌర్ణమి స్నానాలు రావడంతో మాహ కుంభమేళాకు యాత్రికుల తాకిడి, ట్రాఫిక్​ జామ్​ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మహా కుంభ్​ ప్రాంతాన్ని 'నో వెహికల్ జోన్'గా ప్రకటించారు.

మహా కుంభమేళాకు వెళ్తున్న వేల...