భారతదేశం, ఫిబ్రవరి 18 -- Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా 2025 సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోని గంగా నది ప్రమాదకర స్థాయిలో కలుషితం అవుతోంది. మహా కుంభమేళా సమయంలో 53 కోట్లకు పైగా ప్రజలు గంగానదిలో స్నానమాచరించారు. ఈ నేపథ్యంలో, ప్రయాగ్ రాజ్ లోని గంగా జలాల్లో ప్రమాదకరమైన స్థాయిలో ' 'మల కోలిఫామ్' (faecal coliform bacteria) బ్యాక్టీరియాను ప్రభుత్వ సంస్థ గుర్తించింది. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని వివిధ ప్రాంతాల్లో ప్రాథమిక నీటి నాణ్యత ఉండడం లేదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సోమవారం జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT)కి తెలిపింది. ఆయా ప్రాంతాల్లో మలం కొలిఫామ్ బ్యాక్టీరియా స్థాయికి మించి గుర్తించినట్లు వెల్లడించింది.

మానవుల వంటి వేడి రక్తం ప్రవహించే జంతువుల ప్రేగులలో మల కోలిఫామ్ బ్యాక్టీరియా కనిపి...