భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఝార్ఖండ్​లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది! 15ఏళ్ల క్రితం కుటుంబసభ్యుల నుంచి దూరమైన ఒక వ్యక్తి.. తన జీవితం గురించి చాలా విషయాలు మర్చిపోయాడు. కాగా, ఇప్పుడు 'మహా కుంభమేళా' పేరు వినగానే ఆ వ్యక్తికి తన గతం గుర్తొచ్చింది. చివరికి, 15ఏళ్ల తర్వాత అతను తన కుటుంబసభ్యులను కలుసుకున్నాడు.

ఝార్ఖండ్​కి చెందిన ప్రకాశ్​ మహతో అనే వ్యక్తి 2010 సమయంలో కోల్​కతా మున్సిపల్​ కార్పొరేషన్​లో పనిచేసేవాడు. కానీ అతనికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉండేవి. 2010 మేలో ఓరోజు ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయలుదేరిన మహతో అదృశ్యమైపోయాడు! కుటుంబసభ్యులు ఎంత వెతికినా మహతో కనిపించలేదు. ఝార్ఖండ్​లోని మార్కచో పోలీస్​ స్టేషన్​లో మిస్సింగ్​ కేసు కూడా పెట్టారు. పోలీసులు ఎంత గాలించినా మహతో వివరాలు తెలియరాలేదు. కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

కాగా...