భారతదేశం, ఫిబ్రవరి 12 -- Maha Kumbh mela: మహా కుంభమేళా సందర్భంగా మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఉదయం 6 గంటల వరకు 73 లక్షల మందికి పైగా భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. పవిత్ర స్నానం బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

మాఘ పూర్ణిమ స్నానంతో నెల రోజుల పాటు జరిగే కల్పవాలు కూడా ముగుస్తాయి. దాంతో, మాఘ పౌర్ణమి రోజు పవిత్ర స్నానం ఆచరించిన తరువాత సుమారు 10 లక్షల మంది కల్పవాసీలు మహా కుంభమేళా నుంచి వెనుతిరిగి వెళ్లడం ప్రారంభిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అధీకృత పార్కింగ్ స్థలాలను మాత్రమే ఉపయోగించాలని అధికార యంత్రాంగం కల్పవాసీలను కోరింది. మాఘ పౌర్ణమి రోజు లక్షలాది మంది భక్తులు పవిత్ర సంగమంలో స్నానమాచరించేందుకు వెళ్తున్నారు. కాగా, బుధవా...