Hyderabad, ఫిబ్రవరి 25 -- గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పొటాషియం, మెగ్నీషియం ఎంతో ముఖ్యమైనవి. ఈ రెండు పోషకాలు లోపిస్తే గుండె అదుపుతప్పి అవకాశం ఉంటుంది. క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఈ మూడు కూడా మన శరీరానికి రక్షణ కవచంల్లా పనిచేస్తాయి. కాబట్టి ఇవి అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.

చాలామంది కాల్షియం అధికంగా ఉండే ఆహారం తినడంపైనే దృష్టి పెడతారు. నిజానికి మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండే ఆహారం తినడం ఎంతో ముఖ్యం. ఇది లోపించిన కూడా గుండె సమస్యలు త్వరగా వచ్చేస్తాయి. ఇక్కడ మెగ్నీషియం లోపించడం వల్ల ఎలాంటి ప్రభావాలు గుండెపై పడతాయి, ఎలాంటి లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి అనేవి తెలుసుకుందాం.

మెగ్నీషియం లోపం అనేది మన గుండెను నిశ్శబ్దంగా ప్రమాదంలోకి తోసేస్తుంది. మెగ్నీషియం పుష్కలంగా ఉంటే గుండె ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. మన గుండె స్థిరమైన లయను నిర్వహించడానికి ...