భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఈ సంక్రాంతికి కోలీవుడ్ బాక్సాఫీస్ విన్న‌ర్‌గా విశాల్ మ‌ధ గ‌జ రాజా మూవీ నిలిచింది. 2013 షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 12 ఏళ్ల త‌ర్వాత రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ను విస్మ‌య‌ప‌రిచింది. యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో అంజ‌లి, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్లుగా న‌టించారు. సంతానం, సోనూసూద్‌, కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఈ శుక్ర‌వారం (జన‌వ‌రి 31న‌) సేమ్ టైటిల్‌తో మ‌ధగ‌జ రాజా తెలుగులో రిలీజైంది.త‌మిళంలో కాసుల వ‌ర్షం కురిపించిన ఈ యాక్ష‌న్ కామెడీ మూవీకి తెలుగులో తొలిరోజే దెబ్బ ప‌డింది. శుక్ర‌వారం రోజు ఈ మూవీ తెలుగులో న‌ల‌భై ల‌క్ష‌ల వ‌ర‌కు గ్రాస్‌, ఇర‌వై ల‌క్ష‌ల లోపే షేర్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం.

రెండు కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల ...