భారతదేశం, మార్చి 26 -- మ్యాడ్ స్క్వేర్ చిత్రంపై క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంది. సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రల్లో ఈ కామెడీ చిత్రం తెరకెక్కింది. సూపర్ హిట్ అయిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‍గా వస్తోంది. మ్యాడ్ స్క్వేర్ చిత్రం మరో రెండు రోజుల్లో మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో నేడు (మార్చి 26) ట్రైలర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.

గోవాలో లడ్డూ గాడి పెళ్లి కోసం గోవాకు పోయి మ్యాడ్ గ్యాంగ్ చేసే రచ్చ చుట్టూ మ్యాడ్ స్క్వేర్ చిత్రం ఉంది. ట్రైలర్‌లో పంచ్‍ల వర్షం కురిసింది. సంతోష్ శోభన్ మరోసారి టైమింగ్‍తో దుమ్మురేపాడు. నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓయ్ కూడా అదరగొట్టారు. ఫుల్ ఫన్‍‍తో, క్లీన్ కామెడీతో, ఎంటర్‌టైనింగ్‍గా మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ ఉంది. డైరెక్టర్ కల్యాణ్ శంకర్ మరోసారి మ్యాజిక్ చేసినట్టు...