భారతదేశం, మార్చి 28 -- రెండేళ్ల క్రితం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన మ్యాడ్ పెద్ద హిట్ట‌యింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెర‌కెక్కింది. ఈ సీక్వెల్‌లో నార్నే నితిన్‌, సంగీత్ శోభ‌న్‌, రామ్ నితిన్ హీరోలుగా న‌టించారు. క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సీక్వెల్ ఉలా ఉంది? ఫ‌స్ట్ పార్ట్‌కు మించి న‌వ్వించిందా? లేదా? అంటే?

ఇంజినీరింగ్ పూర్త‌యిన మూడేళ్ల త‌ర్వాత డీడీ (సంగీత్ శోభ‌న్‌), అశోక్ (నార్నే నితిన్‌), మ‌నోజ్ (రామ్ నితిన్‌) జీవితాలు మ‌లుపులు తిరుగుతాయి. త‌న ఆస్తుల కోసం అశోక్ కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు. డీడీ స‌ర్పంచ్‌గా పోటీ చేయాల‌ని క‌ల‌లు కంటాడు. ఊరి ప్ర‌జ‌ల మెప్పు కోసం అత‌డు చేసే ప‌నుల‌న్నీ మిస్ ఫైర్ అవుతుంటాయి. మ‌నోజ్‌లో ల‌వ్‌లో ఫెయిల‌వుతాడు.

ల‌డ్డు త‌మ‌కు చెప్ప‌కుండా పెళ్లి చేసుకుంటున్నాడ‌ని తెలుసుక...