Hyderabad, ఏప్రిల్ 11 -- Mad Square OTT Release Date: బ్లాక్‌బస్టర్ మూవీ మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన మూవీ మ్యాడ్ స్క్వేర్. గత నెల 28న థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ పార్ట్ అంత పాజిటివ్ టాక్ రాకపోయినా.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెసైంది. దీంతో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై ఆసక్తి నెలకొంది.

మ్యాడ్ మూవీ పెద్ద హిట్ కావడంతో మ్యాడ్ స్క్వేర్ భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజైంది. మార్చి 28న రిలీజైన ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ ఏప్రిల్ 29 నుంచి ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

కనీసం నాలుగు వారాల గ్యాప్ అనే నిబంధన ఉండటంతో ఈ సినిమాను నెల తర్వాత ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు సమాచారం. మ్యాడ్ స్క్వేర్ కేవలం ఇండియా నెట్ వసూళ్లే రూ.50 కోట్లకు చేరువ కావడం ...