భారతదేశం, మార్చి 31 -- మ్యాడ్ స్క్వేర్ చిత్రం కలెక్షన్లలో సత్తాచాటుతోంది. ఈ కామెడీ సినిమా అంచనాలను దాటేసి బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. యంగ్ యాక్టర్స్ సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ త్రయం మరోసారి మ్యాజిక్ చేసింది. తొలి పార్ట్ మ్యాడ్‍ చిత్రానికి సీక్వెల్‍గా గత శుక్రవారం (మార్చి 28) రిలీజైన ఈ మూవీ దుమ్మురేపుతోంది. మ్యాడ్ స్క్వేర్ చిత్రం మూడోరోజుల్లోనే ఓ మైలురాయి దాటేసింది.

మ్యాడ్ స్క్వేర్ సినిమా రూ.50కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని మూవీ టీమ్ నేడు (మార్చి 31) వెల్లడించింది.

"థియేటర్లు షేక్ అవుతున్నాయి. ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. మ్యాడ్ గ్యాంగ్ రూల్ చేస్తోంది. మ్యాడ్ స్క్వేర్ సినిమా మూడు రోజుల్లో రూ.55.2 కోట్ల గ్రాస్ సొంత...